Journal: Int. J Adv. Std. & Growth Eval.

Mail: allstudy.paper@gmail.com

Contact: +91-9650866419

INTERNATIONAL JOURNAL OF
ADVANCE STUDIES AND GROWTH EVALUATION

Impact factor (QJIF): 8.4  E-ISSN: 2583-6528


Multidisciplinary
Refereed Journal
Peer Reviewed Journal

INTERNATIONAL JOURNAL OF ADVANCE STUDIES AND GROWTH EVALUATION


VOL.: 3 ISSUE.: 12(December 2024)

పాట - తెలంగాణ పోరాట చిత్రణ


Author(s): Guthikonda Chandrakala


Abstract:

పాట చైతన్యవంతమైన కళారూపం. పాటకు పోరాటానికి విడదీయరాని సంబంధం ఉంది. శాంతియుతంగానైనా, ఉద్యమం రూపమైనా పాట లేని పోరాటం కనిపించదు. పాట పోరాటానికి మూల కారణమైన సమస్య తీవ్రతను విశ్లేషించడంలో, పరిష్కారం కోసం ఆలోచించేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో పాట ప్రముఖ పాత్ర వహించింది. వంటావార్పు, రాస్తా రోకో, జైల్ భరో, ధూం ధాం వంటి కార్యక్రమాలలో ప్రతి చోటా ప్రజల నోట పాట ప్రవాహమై, పోరాట స్ఫూర్తిని నింపింది. ఆత్మ గౌరవం, అస్తిత్వ చైతన్యం పెంపొందించి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను రగిలించింది. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఏర్పాటైన సమైక్యాంధ్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించడం మొదలు యాభై ఏళ్లుగా ముల్కీ నిబంధనల ఉల్లంఘన, నీళ్ళు, నిధులు, నియామకాల్లో జరిగిన అన్యాయం, అభివృద్ధి పేరుతో జరిగిన దోపిడీ, ఇలా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పాటలో వివరిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి చాటి చెప్పింది. ఈ ఉద్యమ నేపథ్యంలో వెలువడిన అనేక పాటలు పుస్తకాలుగా, సి.డి లో రూపంలో నేటికీ లభిస్తున్నాయి. ఈ పాటలలో వ్యక్తమైన తెలంగాణ పరిస్థితిని, పోరాట కారణాలను పరిశీలించడం ఈ పత్రం ప్రధాన ఉద్దేశం.

keywords:

Pages: 59-61     |    2 View     |    0 Download

How to Cite this Article:

Guthikonda Chandrakala. పాట - తెలంగాణ పోరాట చిత్రణ. Int. J Adv. Std. & Growth Eval. 2024; 3(12):59-61,